Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గంలో బీటీ రోడ్లకు శంకుస్థాపన!

Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. పాపమ్మవలస, బక్కుపేట గ్రామాల్లో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 18 Sept 2026 6:27 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం నియోజకవర్గంలో బీటీ రోడ్లకు శంకుస్థాపన!

Parvathipuram: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నానని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర తెలిపారు.సీతానగరం మండలం పాపమ్మవలస, బక్కుపేట గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా యంత్రాలకు పసుపు, కుంకుమలతో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి మెరుగైన రహదారులు, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.

పార్వతీపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే విజయచంద్ర పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ పెద్దలు, యువత మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)