Parvathipuram: సాలూరులో మంత్రి సంధ్యారాణి సమీక్షా సమావేశం!

Parvathipuram: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో మంత్రి సంధ్యారాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.15 కోట్ల HAM నిధులతో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

B VENKATESH, SALURU
Published on: 21 Sept 2026 2:53 PM IST
Parvathipuram
X

Parvathipuram: సాలూరులో మంత్రి సంధ్యారాణి సమీక్షా సమావేశం!

Parvathipuram: సాలూరు మున్సిపాలిటీలో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సంధ్యారాణి రాష్ట్రవ్యాప్తంగా రూ.5,500 కోట్ల HAM నిధులను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు కుప్పం లో ప్రారంభించనున్నారు అందులో సాలూరు మున్సిపాలిటీకి రూ.15 కోట్ల HAM నిధులు తీసుకొచ్చామని మంత్రి వెల్లడి.

మంజూరైన నిధులతో సాలూరులో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు వీధి లైట్లు, తాగునీరు , మరుగుదొడ్లు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని మంత్రి సూచన RTC కాంప్లెక్స్ నుంచి MRO కార్యాలయం వరకు రూ.44 లక్షలతో సెంటర్ లైటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశం.

2009 కంటే ముందు ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ఇళ్ల పన్నులు మంజూరు చేయాలని మంత్రి ఆదేశం రైతు బజార్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశం. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచన.

సాలూరు మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో పైలట్ వాటర్ స్కీమ్‌లు ఏర్పాటు చేశామని వెల్లడి. అవసరమున్న వార్డుల్లోనూ వాటర్ స్కీమ్‌లను మంజూరు చేస్తామని మంత్రి ప్రకటనప్రజలను ఇబ్బంది పెట్టేలా అధికారులు వ్యవహరించొద్దని. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరిక. ఈ సమావేశంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ వైశాలి IAS, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU