Parvathipuram: తుఫాను ప్రభావంపై అధికారులతో సమీక్ష తక్షణ చర్యలకు ఆదేశం!

Parvathipuram: అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో సాలూరులో నీటమునిగిన ఆర్టీసి కాంప్లెక్స్ ఆవరణను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను వెంటనే బాగుచేయాలని అధికారులకు ఆదేశం.

B VENKATESH, SALURU
Published on: 25 Sept 2026 1:08 PM IST
Parvathipuram
X

Parvathipuram: తుఫాను ప్రభావంపై అధికారులతో సమీక్ష తక్షణ చర్యలకు ఆదేశం!

Parvathipuram: అర్ణబ్ తుఫాన్ కారణంగా సాలూరు పట్టణంలో మునిగిపోయిన RTC కాంప్లెక్స్ ఆవరణలో వరద నీటిని పరిశీలించిన మంత్రి సంధ్యారాణి ప్రయాణీకుల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన మంత్రి సంధ్యారాణి.

తుఫాను కారణంగా సాలూరు నియోజకవర్గంలో రోడ్లు, చెరువులు, పంటపొలాలు మరియు నివాస గృహాలు పరిస్థితి గూర్చి ఆరా తీసిన మంత్రి సంధ్యారాణ సాలూరు మండలం పెదపదం పంచాయితీ నీలం చెరువు,నెలిపర్తి నుంచి విశ్వనాధపురం దెబ్బతిన్న పంచాయితీ రహదారి

మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయితీ చిట్టి గెడ్డ కల్వర్టు పాచిపెంట మండలంలో పాడైన వేటగానివలస రహదారి పనులను వెంటనే చేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రి సంధ్యారాణి. వర్షాలు మరియు ఇతర పరిస్థితుల కారణంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన రక్షణ చర్యలు చేపడతామన్న మంత్రి సంధ్యారాణి.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU