Gajapathinagaram: గొడియాడలో రూ.2.52 కోట్ల పనులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Gajapathinagaram: విజయనగరం జిల్లా గొడియాడ గ్రామంలో రూ.2.52 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించి పరిశీలించారు.
Gajapathinagaram: గొడియాడలో రూ.2.52 కోట్ల పనులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా: గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం గొడియాడ గ్రామంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. శనివారం గ్రామంలో పర్యటించిన మంత్రి అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రూ.2.52 కోట్లతో అభివృద్ధి పనులు నాబార్డ్ నిధులతో:రూ.1.86 కోట్ల అంచనా వ్యయంతో బుడతనాపల్లి మీదుగా గొడియాడ వరకు వీబీ (VB) రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.వీఎంఆర్‌డీఏ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో తాగునీటి సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.46 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్డు, కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఈ అభివృద్ధి పనులు పూర్తయితే గొడియాడ గ్రామ ప్రజలకు రవాణా, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయని తెలిపారు.




