Merakamudidam: చిన్న బంటుపిల్లిలో టీడీపీలోకి భారీ చేరికలు

Merakamudidam: విజయనగరం జిల్లా చిన్న బంటుపిల్లిలో టీడీపీలోకి భారీ చేరికలు. ఎమ్మెల్యే కళా వెంకటరావు, చిన్న శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా పార్టీలోకి స్వాగతం.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 13 Oct 2026 10:37 PM IST
Merakamudidam
X

Merakamudidam: చిన్న బంటుపిల్లిలో టీడీపీలోకి భారీ చేరికలు

మెరకముడిదాం: విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం చిన్న బంటుపిల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. మాజీ జెడ్పీటీసీ కోట్ల వెంకటరావు, మాజీ సర్పంచ్ బూరె నరేశ్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చి టీడీపీలో చేరారు.

ఈ కార్యక్రమానికి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు, టీడీపీ అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ.. తనను నమ్మి వచ్చిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరకముడిదాం మండలంలోని అన్ని పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.ఎస్.ఆర్. రామ్ మల్లిక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY