Parvathipuram: మ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన దాడి రత్నాకర్!
Parvathipuram: స్థానిక ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి దాడి రత్నాకర్ పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిశారు. అనంతరం మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
Parvathipuram: మ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన దాడి రత్నాకర్!
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైన దాడి రత్నాకర్ పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్వతీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు.
ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జిల్లా ఇన్‌చార్జి దాడి రత్నాకర్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. అనంతరం ఇరువురు నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
అనంతరం పోలీస్ గెస్ట్‌హౌస్‌లో జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కురుపాం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్రలతో కలిసి దాడి రత్నాకర్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నాయకులు సమాలోచనలు జరిపారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం, ఎన్నికల సన్నద్ధత, స్థానిక పరిస్థితులు, పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులు చర్చించినట్లు సమాచారం.




