Parvathipuram: పంచాయతీ రెండో విడత ఎన్నికలు: మద్యం దుకాణాల మూసివేత!

Parvathipuram: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 26 Nov 2026 9:45 PM IST
Parvathipuram
X

Parvathipuram: పంచాయతీ రెండో విడత ఎన్నికలు: మద్యం దుకాణాల మూసివేత!

పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 రెండో విడత పోలింగ్ నేపథ్యంలో, ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్. ప్రభాకర రెడ్డి, ఐ.ఏ.ఎస్. గారు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల మేరకు రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్న పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో ఎన్నికల కోసం నోటిఫై చేయబడిన గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రాంతాల పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు (ఏ4 షాపులు), కల్లు దుకాణాలు (టీసీఎస్/టీఎఫ్‌టీ) 2026 నవంబర్ 27వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుంచి మూసివేయాలని ఆదేశించారు. ఈ మూసివేత 2026 నవంబర్ 29వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. నవంబర్ 29వ తేదీన ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పోలింగ్, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించబడుతుంది.

మూసివేత కాలంలో సంబంధిత ప్రాంతాల్లో మద్యం, బీరు లేదా కల్లు విక్రయించడం, సరఫరా చేయడం, పంపిణీ చేయడం పూర్తిగా నిషేధమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఉత్తర్వులు పకడ్బందీగా అమలయ్యేలా సంబంధిత ఎక్సైజ్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, ఎక్కడైనా అక్రమ మద్యం విక్రయాలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA