Parvathipuram: కురుపాంలో ఎంపీటీసీలకు ఆత్మీయ సన్మానం!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పదవీకాలం ముగిసిన ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులను ఘనంగా సన్మానించారు.

V.SESHU	, KURUPAM
Published on: 23 Sept 2026 5:31 PM IST
Parvathipuram
X

Parvathipuram: కురుపాంలో ఎంపీటీసీలకు ఆత్మీయ సన్మానం!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో ఎంపీటీసీల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఎంపీపీ శెట్టి పద్మావతి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులకు ఆత్మీయ సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు గత ఐదేళ్లుగా మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజలతో మమేకమై పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పదవీకాలం ముగిసినప్పటికీ ప్రజా సేవ పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని తెలిపారు.

అలాగే తమ పదవీకాలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో సహకరించిన ప్రభుత్వ అధికారులకు సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అధికారుల సహకారం వల్లే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలిగామని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమకు అధికారులు ఇదే విధంగా సహకరించాలని కోరారు. ప్రజల సంక్షేమం, మండల అభివృద్ధి కోసం అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎంపీపీ శెట్టి పద్మావతి ప్రజాప్రతినిధులను శాలువాలు కప్పి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM