Vizianagaram: విజయనగరం వేపాడ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన జేసీ!
Vizianagaram: భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జేసీ సేధు మాధవన్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులను అప్రమత్తం చేశారు.
Vizianagaram: విజయనగరం వేపాడ కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన జేసీ!
Vizianagaram: భారీ వర్షాల నేపథ్యంలో వేపాడ మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంయుక్త కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును పరిశీలించి, ఇప్పటివరకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను సమీక్షించారు.
తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెయిన్ గేజ్‌ను పరిశీలించారు. వర్షపాత వివరాలను ప్రతి గంటకు ఒకసారి క్రమం తప్పకుండా నమోదు చేసి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో మండలంలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, లోతట్టు ప్రాంతాలు, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీలో మండల తహసీల్దార్ జె. రాములమ్మ, ఎంపీడీవో సూర్యనారాయణ, తదితరలు పాల్గొన్నారు.




