Parvathipuram: మన్యం గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి!
Parvathipuram: కొమరాడ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను జేసీ ఆర్. వైశాలి తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
Parvathipuram: మన్యం గిరిజన విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి!
Parvathipuram: దసరా సెలవుల అనంతరం పాఠశాలకు తిరిగి వచ్చిన గిరిజన విద్యార్థినుల ఆరోగ్యం, ఆహారం, వసతి సౌకర్యాలపై అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాయింట్ కలెక్టర్ ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు.గురువారం కొమరాడ మండలంలోని ఉలిపిరి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని పారిశుద్ధ్య నిర్వహణ, వంటగది, మరుగుదొడ్లను తనిఖీ చేసి, పరిసరాల పరిశుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. సెలవుల తర్వాత విద్యార్థినులు తిరిగి వచ్చిన నేపథ్యంలో, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాల ఆవరణలో పరిశుభ్రత పాటించడంతో పాటు విద్యార్థినులకు సురక్షితమైన తాగునీరు అందించాలని సూచించారు.అలాగే, వంటగదిలో పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం తయారు చేయాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థినులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.




