Salur: సాలూరులో ఉత్సాహంగా ప్రారంభమైన జనసేన మున్సిపల్ ఎన్నికల ప్రచారం!
Salur: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేగవంతం చేసింది. చైర్‌పర్సన్ అభ్యర్థి గొర్లె విజయకుమారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Salur: సాలూరులో ఉత్సాహంగా ప్రారంభమైన జనసేన మున్సిపల్ ఎన్నికల ప్రచారం!
Salur: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని జనసేన పార్టీ ప్రారంభించింది. జనసేన మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి గొర్లె విజయ కుమారి ప్రచారంలో పాల్గొన్నారు.
సాలూరు మున్సిపాలిటీలోని 32 వార్డులకు జనసేన తరఫున 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో, పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని నాలుగో, వార్డుల్లో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి , చైర్‌పర్సన్ అభ్యర్థి గొర్లె విజయ్ కుమారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ, తమ పార్టీ గుర్తు గ్లాస్ గుర్తు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ నినాదాలతో ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లను కలుసుకుని తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సాలూరు పట్టణంలో జనసేన నాయకులు వార్డు లో ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.




