Parvathipuram: పార్వతీపురం బెలగాం చర్చిలో ఉచిత వైద్య శిబిరం!

Parvathipuram: పార్వతీపురం బెలగాం చర్చిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 260 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి, నిరుపేదలకు మందులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 27 Sept 2026 5:58 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం బెలగాం చర్చిలో ఉచిత వైద్య శిబిరం!

Parvathipuram: స్థానిక చర్చి వీధిలోని పునీత కార్మిక జోజప్ప (బెలగాం విచారణ) దేవాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఫాదర్ బి.మహేంద్ర ప్రసాద్ నేతృత్వంలో విన్సెంట్ డి పాల్, విచారణ కౌన్సిల్ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచారణ పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు హాజరయ్యారు. ​అనిల్ నీరుకొండ ఆసుపత్రికి చెందిన వైద్యులు, సిబ్బందితో పాటు స్థానిక స్వచ్ఛంద వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని రోగులకు సేవలు అందించారు.

సుమారు 260 మందికి పైగా ప్రజలకు రక్తపోటు, మధుమేహం, ఈసీజీ సహా ఇతర శరీర భాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య సేవలతో పాటు విన్సెంట్ డి పాల్ సభ్యుల ఆధ్వర్యంలో పలువురు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు.​

ఈ సందర్భంగా ఫాదర్ బి.మహేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విచారణ పెద్దలు, విన్సెంట్ డి పాల్ సభ్యులు, స్థానిక యువత, అనిల్ నీరుకొండ వైద్య బృందం, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పూర్తిగా ఉచితంగా పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)