Palakonda: పాలకొండలో ఆహార భద్రతపై విస్తృత అవగాహన సదస్సు
Palakonda: పాలకొండలో ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్ సభ్యులకు ఆహార కల్తీ గుర్తింపు, స్వచ్ఛ ఆహార ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Palakonda: పాలకొండలో ఆహార భద్రతపై విస్తృత అవగాహన సదస్సు
Palakonda: పాలకొండ పట్టణాలలో జిల్లా ఆహార నియంత్రణ మరియు భద్రతా శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సులు నిర్వహించారు. సంచాలకులు ఐ.పి.ఎం. వారి ఆదేశాల మేరకు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
సదస్సులలో వివిధ ప్రాంతాలకు చెందిన వాకర్స్ క్లబ్ ల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఆహార భద్రతాధికారి పి. వేంకట రమణ, ఆహార భద్రతాధికారి ఎమ్. వినోద్ కుమార్ లు హాజరై 'స్వచ్ఛ ఆహారం' ప్రాముఖ్యతపై సభ్యులకు విస్తృతమైన అవగాహన కల్పించారు.
రోజూ మనం తీసుకునే ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం, కల్తీని గుర్తించడం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం గురించి వారు వివరించారు. అనంతరం వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక కరపత్రాలను సభ్యులకు పంపిణీ చేశారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఆహార భద్రతా నియమాలు పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.




