Seethampeta: సీతంపేట మండలంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ దాడులు!

Seethampeta: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీతంపేట మండలంలోని మూడు గ్రామాల్లో మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 6,800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం, 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 17 Nov 2026 7:20 PM IST
Seethampeta
X

Seethampeta: సీతంపేట మండలంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ దాడులు!

సీతంపేట: సీతంపేట మండలంలో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు, మూడు కేసులు నమోదు స్వాధీనం ముగ్గురి పై కేసులు 6800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం 20 లీటర్ల నాటుసారా, పంచాయతీ ఎన్నికల నేపద్యంలో నాటు సారాయి తయారీ, రవాణా మరియు అమ్మకాలును నిరోదించుటలో బాగంగా మంగళగిరిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోరెస్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్, విజయనగరం శ్రీ పైడి రామచంద్ర రావు గారి పర్యవేక్షణలో నేడు సీతంపేట మండలంలోని ఎగువ బుడగరాయి, నారాయణగూడ, బిల్లగూడ గ్రామాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. మరియు నాటు సారాయి త్రాగడం వలన వచ్చే అనర్దాలు గూర్చి navodayam 2.0+ కార్యక్రమం లో బాగంగా అవగాహన కల్పించడం జరిగింది. నాటుసారాయి రవాణా జరిగే ప్రాంతాలలో వాహన తనిఖీ నిర్వహించడం జరిగింది.

ఎగువ బుడగరాయి, నారాయణగూడ, బిల్లగూడ గ్రామంలో నిర్వహించిన దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 74 డ్రమ్ముల్లోని 6800 లీటర్ల పులియబెట్టిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని, ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడమైనది, ఈ దాడులలో STF Mangalagiri ES S. Krishna Kishore Reddy, Enft. Vizayanagaram AES MV.Gopalakrishna, CI W, SI పాల్గొనడం జరిగినదని CI K. Suryakumari గారు తెలియజేసినారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA