Palakonda: అన్నవరం గ్రామంలో వరద పరిస్థితులను పరిశీలించిన సబ్ కలెక్టర్!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అన్నవరం గ్రామంలో వరద పరిస్థితులను సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పరిశీలించి, గర్భిణి, డయాలసిస్ రోగిని సురక్షితంగా తరలించారు.
Palakonda: అన్నవరం గ్రామంలో వరద పరిస్థితులను పరిశీలించిన సబ్ కలెక్టర్!
Palakonda: పాలకొండ మండలంలోని వరద నీటి ముంపునకు గురైన అన్నవరం గ్రామానికి NDRF సిబ్బంది మరియు DSP గారితో కలిసి బోటు ద్వారా వెళ్లిన సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవార్, IAS గ్రామంలోని పరిస్థితులను ప్రత్యక్షంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రజల పరిస్థితులను అడిగి తెలుసుకుని, అత్యవసర వైద్య సహాయం అవసరమైన గర్భిణీ మహిళను మరియు డయాలసిస్ పేషెంట్‌ను బోటు ద్వారా సురక్షితంగా పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించే చర్యలను పర్యవేక్షించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వరద పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.




