Parvathipuram: పార్వతీపురంలో ఈ నెల 25న జిల్లా స్థాయి యువజనోత్సవాలు!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 25న జిల్లా స్థాయి యువజనోత్సవాల పోటీలు.. వివరాలు వెల్లడించిన సెట్‌విజ్ సీఈవో వి.వి. అప్పలనాయుడు.
Parvathipuram: పార్వతీపురంలో ఈ నెల 25న జిల్లా స్థాయి యువజనోత్సవాలు!
Parvathipuram: యువజన సర్వీసుల శాఖ మరియు సెట్‌విజ్ (SETVIZ) ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి వారి ఆదేశముల ప్రకారం ఈనెల 25వ తేదీ శుక్రవారం ఉదయం 9.00 గంటల నుండి పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా స్థాయి యువజనోత్సవాల పోటీలు నిర్వహించనున్నట్లు ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి. అప్పలనాయుడు ప్రకటన ద్వారా తెలియజేశారు.
15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని, పాల్గొనే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్ జిరాక్స్, వయస్సు ధృవీకరణ పత్రం మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. పోటీలలో భాగంగా జానపద నృత్యాలు (గ్రూప్ - గరిష్టంగా 10 మంది), జానపద గీతాలు (గ్రూప్ - గరిష్టంగా 10 మంది), వీధి నాటకం/నుక్కడ్ నాటక్ (గ్రూప్ - గరిష్టంగా 10 మంది)తో పాటు వ్యక్తిగత విభాగాలలో కవిత్వ రచన, పెయింటింగ్ పోటీలు జరుగుతాయి.
ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి మెమొంటోలు మరియు సర్టిఫికెట్లు బహుకరిస్తారు. అలాగే జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు, రాష్ట్ర స్థాయిలో నెగ్గిన వారు జాతీయ స్థాయి యువజనోత్సవాలలో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇతర వివరాల కోసం కార్యాలయ పనివేళల్లో 9494334044 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.




