Parvathipuram: గుమ్మలక్ష్మీపురం మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్‌పేటలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేసి, అనుమతులు లేని మెడికల్ షాపును మూసివేయాలని ఆదేశించారు.

V.SESHU	, KURUPAM
Published on: 3 Oct 2026 9:10 AM IST
Parvathipuram
X

Parvathipuram: గుమ్మలక్ష్మీపురం మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు!

Parvathipuram: గుమ్మలక్ష్మీపురం, అక్టోబర్ 3: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట గ్రామంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని పలు వ్యాపార దుకాణాలను సందర్శించిన ఆయన పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ సందర్భంగా దుకాణాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాపారులకు సూచించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, దుకాణాల వద్ద అపరిశుభ్రత కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం గ్రామంలోని ఓ మెడికల్ షాపును తనిఖీ చేసిన కలెక్టర్, షాపు నిర్వహణకు సంబంధించిన అనుమతులు, లైసెన్సులు మరియు ఇతర రికార్డులను పరిశీలించారు. అవసరమైన పత్రాలు అందుబాటులో లేకపోవడంతో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించే వరకు షాపును తాత్కాలికంగా మూసివేయాలని అధికారులను ఆదేశించారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం, పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థలు నిబంధనలు పాటిస్తూ పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని ఆయన సూచించారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM