Vizianagaram: విజయనగరంలో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి: కలెక్టర్!

Vizianagaram: విజయనగరంలో భోగాపురం ఎయిర్‌పోర్టు అనుసంధాన రోడ్లు, భూసేకరణ వంటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 26 Sept 2026 1:34 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరంలో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి: కలెక్టర్!

Vizianagaram: జిల్లాలోని ప్రాజెక్టుల‌ను, భూసేక‌ర‌ణ‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి చెప్పారు. ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ స్పెష‌ల్ ఛీఫ్ సెక్ర‌ట‌రీ, ఇత‌ర ఉన్న‌తాధికారులు అమ‌రావ‌తి నుంచి శ‌నివారం నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి, జెసి ఎస్‌.సేధు మాధ‌వ‌న్ పాల్గొన్నారు.

భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్ర‌యం అభివృద్ది, ఏవియేష‌న్ హ‌బ్‌, విజ‌య‌న‌గ‌రం నుంచి బొడ్డ‌వ‌ల‌స‌, గంట్లాం మీదుగా విమానాశ్ర‌య అనుసంధాన ర‌హ‌దారి, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ త‌దిత‌ర ప్రాజెక్టుల‌కు సంబంధించిన పురోగ‌తిని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. వీలైనంత వేగంగా వీటిని పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.