Bobbili: బొబ్బిలిలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా!
Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలిలో జీతాలు పెంచమన్నందుకు ఏపీఐఐసీ నీటి సరఫరా విభాగం కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Bobbili: బొబ్బిలిలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా!
Bobbili: బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఏపీఐఐసీ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న 9 మంది కార్మికులకు కనీస వేతనాలు, మౌలిక సౌకర్యాలు లేకుండా అన్యాయంగా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఏపీఐఐసీ జిల్లా, జోనల్ మేనేజర్ లకు వినతి పత్రాలు ఇస్తే శ్రీ సాయినాథ ఏజెన్సీ కాంట్రాక్టర్ సంఘంలో చేరారని జీతాలు అడుగుతున్నారని 9 మందిని తొలగిస్తున్నట్లు నోటీసులు పంపించారు.
దీనికి వ్యతిరేకంగా ఈరోజు బొబ్బిలి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శంకరరావు, గ్రోత్ సెంటర్ సిఐటియు నాయకులు సింగిరెడ్డి గోపాలు మాట్లాడుతూ 8500/- జీతం ఇచ్చి అందులో ఇఎస్ఐ, పి ఎఫ్ కటింగ్ చేసి 5000/- రూపాయలు జీతం ఇస్తున్న కాంట్రాక్టుర్ పై చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసి అధికారులకు వినతిపత్రం ఇస్తే కనీసం పట్టించుకోలేదు.
డిప్యూటీ లేబర్ కమిషనర్ కు వినతిపత్రం ఇస్తే ఇంతవరకు జాయింట్ మీటింగ్ వేయలేదు. కార్మికుల పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు. తక్షణమే ఎమ్మెల్యే గారు బొబ్బిలి ఎమ్మార్వో గారు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. మొత్తం ఏపీఐఐసి నీటి సరఫరా విభాగం టెండర్ లో అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
కార్మికులకు కనీస వేతనాలు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం వారాంతపు పండగ సెలవులు చట్టపరంగా అమలు చేయాలని టెండర్లు జరుగుతున్న అవినీతిపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారు ఈ వినతి పత్రం ఆర్ఐ, డి టి గారికి ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో కార్మికుల సమస్య పరిష్కరించని ఎడల పరిశ్రమలకు నీటి సరఫరా బంద్ చేస్తామని తెలియజేశారు.
దీనివలన జరిగే పరిణామాలకు ఏపీఐఐసీ అధికారులదే బాధ్యతని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జొన్నాడ జగదీష్ కొల్లి జోగినాయుడు తెంటు ధనుంజయ్ కొల్లి హరిహరరావు సిఐటియు మండల కన్వీనర్ జి. లక్ష్మి వి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.




