Bobbili: బొబ్బిలిలో ఆర్టీసీ పరిరక్షణ కోసం సీఐటీయూ కరపత్రాల పంపిణీ!
Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఐటీయూ నిరసన.. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగించొద్దని డిమాండ్.
Bobbili: బొబ్బిలిలో ఆర్టీసీ పరిరక్షణ కోసం సీఐటీయూ కరపత్రాల పంపిణీ!
Bobbili: ఏపీఎస్ఆర్టీసీ ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణా సంస్థ రాష్ట్రంలోని అత్యధిక గ్రామాలతో సహా ప్రజలకు గత 75 సంవత్సరాల నుంచి సేవలందిస్తున్నది. ప్రతిరోజు 48 లక్షల మంది ప్రజల ప్రయాణిస్తున్నారు. మన రాష్ట్రంలో స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. విద్యార్థులు వృద్ధులు, వికలాంగులకు రాయతీలతో సేవలందిస్తున్నది. విద్యుత్ బస్సులు పేరుతో ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శంకరరావు అన్నారు.
విద్యుత్తు, మున్సిపాలిటీలతో సహా ప్రైవేటుకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఆర్టీసీ వేరే - రాష్ట్ర ప్రభుత్వం వేరు కాదు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్రప్రభుత్వం 2024 లో పూనే కి చెందిన పినాకిల్ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేశారు. దీనిని అమలు చేయడానికి చర్యలు ఇటీవలే వేగవంతం చేశారు. 4 డిపోలను ఖాళీ చేయించారు. మరో 8 డిపోలను ఖాళీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.
750 విద్యుత్తు బస్సులను ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారు. మరో 300 బస్సులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ బస్సులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి బస్సుకు 40 లక్షల చొప్పున ఉచిత సబ్సిడీ ఇస్తున్నారు. ఈ ఒప్పందంతో ఆర్టీసీ మరింత నష్టాల్లోకి కూరిపోవడం ఖాయం ఇప్పటికే స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 1680 కోట్లకు పైగా ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి. ఈ డబ్బులతో కొత్త బస్సులు ఎందుకు ఆర్టీసీ కొనడం లేదు.
విలువైన ఆర్టీసీ స్థలాలు ప్రైవేటుకి ఇస్తే పాలకులకు కోట్ల కమిషన్లు వస్తాయి ఆర్టీసీని వదిలించుకుంటే స్త్రీ శక్తితో సహా ఇప్పుడున్న రాయితీలన్నీ ఎగిరిపోతాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్ర చేస్తున్నది. ప్రజలందరూ ఆర్టీసీని కాపాడుకోవాలి ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గేదెల అప్పలనాయుడు జి. వాసు తదితరులు పాల్గొన్నారు.




