Parvathipuram: పార్వతీపురం కలెక్టరేట్ ఎదుట సీఐటియు ఆందోళన!

Parvathipuram: పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ఎన్‌ఎంఈపీ కార్మికుల నిరసన. నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటియు డిమాండ్.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 21 Sept 2026 4:00 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురం కలెక్టరేట్ ఎదుట సీఐటియు ఆందోళన!

Parvathipuram: కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశా రు అనంతరం గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ సీతంపేట మండలం మర్రిపాడు కుసుమి డోన్ బై పి హెచ్ సి ల పరిధిలో గ్రామాలలో మలేరియా విజృంభన నిర్మూలనకి దోమల మందు కాలువలో పొదల్లో మలేరియా నిర్మూలన కోసం నిరంతరం దోమల మందు పిచికారి చేస్తున్న కార్మికులకు నాలుగు నెలల నుండి వేతనాలు చెల్లించకపోవడం చాలా అన్యాయమని అన్నారు.

గ్రామాలను పరిశుభ్రం కోసం దోమలను విశ్రమించకుండా ఉండడం కోసం శ్రమిస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోగా ఇస్తున్న అరాకొర వేతనాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదు కావున నేషనల్ మిషనరీ ఎరిడికల్ ప్రోగ్రాం ద్వారా దోమల నివారణ కృషి చేస్తున్న కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి.

మాస్కులు గ్లౌజులు దోమల మందు పిచికారి చేసే పరికరాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీతంపేట నాయకులు సాంబయ్య గారు, నారాయణ, నాగరాజు తదితర కార్మికులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)