Palakonda: పాలకొండ ఆర్సీఎం సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో బాలల దినోత్సవం!

Palakonda: పాలకొండ ఆర్సీఎం సెయింట్ జోసెఫ్ ఎయిడెడ్ యూపీ స్కూల్‌లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

KAILASH SAHU, PALAKONDA
Published on: 14 Nov 2026 4:52 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ ఆర్సీఎం సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో బాలల దినోత్సవం!

పాలకొండ: RCM St జోసెఫ్ ఎయిడెడ్ యుపి స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ పిల్లలలో సృజనాత్మకత ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పొట్నూర్ జస్వంత్ నెహ్రూ గారి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు

విద్యార్థుల సంతోషమే పాఠశాల విజయమని పేర్కొంటూ ఉపాధ్యాయులు పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు క్రమశిక్షణ సామాజిక బాధ్యత కలిగి ఉన్న ఉత్తమ పౌరులుగా ఎదగాలని పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ రాణి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA