Cheepurupalli: ఎమ్మెల్యే కళావెంకటరావు సమక్షంలో టీడీపీలోకి 3 వేల మంది!

Cheepurupalli: చీపురుపల్లిలో వైసీపీకి ఎదురుదెబ్బ. ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సమక్షంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల నుండి 3 వేల మంది టీడీపీలో చేరారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 14 Oct 2026 8:58 PM IST
Cheepurupalli
X

Cheepurupalli: ఎమ్మెల్యే కళావెంకటరావు సమక్షంలో టీడీపీలోకి 3 వేల మంది!

చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్. చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల నుంచి సుమారు 3 వేల మంది వైసీపీని వీడి టీడీపీలో చేరిక. మాజీ జెడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, శిరీష గార్ల ఆధ్వర్యంలో భారీ చేరికలు. ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్న నేతలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు ఆకర్షితులై టీడీపీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే కళావెంకటరావు వెల్లడి. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని హామీ. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎమ్మెల్యే బాబూరావు, KTR లు పాల్గొన్నారు.

చీపురుపల్లిలో పసుపు జెండా హోరు మొదలైంది. గరివిడి, గుర్ల, చీపురుపల్లి మండలాల నుండి మాజీ జెడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు గారితో పాటు 3 వేల మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు గారి సంక్షేమ పాలన చూసే ప్రజలు టీడీపీ వైపు వస్తున్నారన్నారు. మాజీ జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను గారు, యువనేత రామ్ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ గొడ్డలి పార్టీ అరాచకాలతో విసిగిపోయి ప్రజలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY