Parvathipuram: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర. నవంబర్ 1న పోలింగ్.. ప్రచార నిషేధ నిబంధనలు పాటించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి స్పష్టం.
Parvathipuram: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!
Parvathipuram: నవంబరు 1వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రం 5:00 గంటలతో ముగియనుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
48 గంటల ముందే ప్రచార నిషేధం
ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయమునకు 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 5:00 గంటల తర్వాత జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మైకులు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు మరియు ఇతర ప్రచార కార్యక్రమాలకు అనుమతి ఉండదని తేల్చిచెప్పారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు.




