Parvathipuram: పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 28 Jun 2026 12:19 PM IST
Parvathipuram
X

Parvathipuram: పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి

పార్వతీపురం: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశం నుంచి పోలియోను పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

పోలియో నిర్మూలనలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని పేర్కొన్నారు.

పిల్లల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నారని తెలిపారు.

ఇంటింటికీ వెళ్లి సేవలందిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story