Bobbili: ప్రలోభాలతోనే టీడీపీలోకి చేరికలు వైసీపీ ఆరోపణ
Bobbili: బొబ్బిలిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఫిరాయింపుల రాజకీయం వేడెక్కింది. ప్రలోభాలతోనే టీడీపీలో చేర్చుకుంటున్నారని వైసీపీ నాయకులు ఆరోపణలు.
Bobbili: ప్రలోభాలతోనే టీడీపీలోకి చేరికలు వైసీపీ ఆరోపణ
బొబ్బిలి: బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ ఫిరాయింపులతో రాజకీయం వేడెక్కింది. నిన్న అక్టోబర్ 7న మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామమైన పక్కి గ్రామం నుండి కొన్ని కుటుంబాలు బొబ్బిలి కోటలో MLA బేబీనాయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.అయితే మరుసటి రోజే అంటే ఈరోజు పక్కి గ్రామ ప్రజలు సంచలన ఆరోపణలు చేశారు.
బొబ్బిలి మండలం పక్కి గ్రామం వైయస్సార్సీపి ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సొంత గ్రామం! నిన్న అక్టోబర్ 7న ఈ గ్రామం నుండి - కొన్ని కుటుంబాలు బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నాయి. ఈ చేరికల నేపథ్యంలో ఈరోజు పక్కి గ్రామంలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు వెంకటేశ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆరోపణలు చేశారు.
టీడీపీ నాయకులు ప్రలోభాలు పెట్టి కండువాలు వేస్తున్నారని వారు ఆరోపించారు.టీడీపీలో చేరితేనే పింఛన్లు ఇళ్లు ఇస్తామని చెప్పి పేదలను బలవంతంగా టీడీపీలోకి చేర్చుకుంటున్నారని వైసీపీ నేతలు అన్నారు! పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
అంతేకాకుండా పక్కి గ్రామస్తులు బస్సు సమస్యను కూడా లేవనెత్తారు.బొబ్బిలి నుండి పక్కి గ్రామానికి 2024 ఆగస్టు వరకు బస్సులు తిరిగేవని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు తిరిగి ఇప్పుడు పూర్తిగా ఆగిపోయాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కి గ్రామానికి తిరిగి బస్సు సర్వీసును పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.




