Bobbili: బొబ్బిలిలో వైసీపీకి షాక్: కౌన్సిలర్, జేసీఎస్ కన్వీనర్ రాజీనామా
Bobbili: బొబ్బిలిలో మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను బాటలో జేసీఎస్ కన్వీనర్ రేజేటి ఈశ్వరరావు, మాజీ కౌన్సిలర్ కృష్ణవేణి వైసీపీకి రాజీనామా చేశారు.
Bobbili: బొబ్బిలిలో వైసీపీకి షాక్: కౌన్సిలర్, జేసీఎస్ కన్వీనర్ రాజీనామా
Bobbili: బొబ్బిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి jcs కన్వీనర్ రేజేటి ఈశ్వరరావు (విస్సు) 29వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేజేటి కృష్ణవేణి, రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందేనని తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అనుసరిస్తూ, ఆయన బాటలోనే ముందుకు సాగాలనే ఉద్దేశంతో తాము కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
తమ రాజీనామాకు సంబంధించి వైసిపిపార్టీకి సమాచారం అందించినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం తమ తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నామని, త్వరలోనే భవిష్యత్ రాజకీయ కార్యాచరణను అధికారికంగా వెల్లడిస్తామని రేజేటి ఈశ్వరరావు (విస్సు) కృష్ణవేణి,తెలిపారు.




