Parvathipuram: పార్వతీపురంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!
Parvathipuram: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పార్వతీపురంలో రక్తదాన శిబిరం.. హాజరై యువతను అభినందించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.
Parvathipuram: పార్వతీపురంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!
Parvathipuram: పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హాజరై రక్తదానం చేసిన యువతను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వివిధ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తోందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.




