Bobbili: చారిత్రక బొబ్బిలి కోటలో వైభవంగా ఆయుధ పూజ వేడుకలు!
Bobbili: చారిత్రక బొబ్బిలి కోటలో వైభవంగా ఆయుధ పూజ వేడుకలు. దర్బార్ మహల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే బేబినాయన.
Bobbili: చారిత్రక బొబ్బిలి కోటలో వైభవంగా ఆయుధ పూజ వేడుకలు!
Bobbili: బొబ్బిలిలో చారిత్రక బొబ్బిలి కోటలో ఆయుధ పూజ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం బొబ్బిలి కోటలోని దర్బార్ మహల్ లో రాజవంశీయులు ఆయుధ పూజను ప్రతి సంవత్సరం దసరా ముందు రోజు అనగా ఈరోజు ఘనంగా నిర్వహించారు.
బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన చారిత్రక ఆయుధాలను అలాగే రాజుల కాలం నాటి బంగారు సింహాసనాన్ని దర్బార్ మహల్ లో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా దసరా పర్వదినాన ఆయుధ పూజను నిర్వహిస్తున్నట్లు బొబ్బిలి రాజవంశీయులు మాజీ మంత్రి మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ కృష్ణ రంగారావు, రామునాయన, ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు.
పూజల అనంతరం కోటకు విచ్చేసిన భక్తులకు మరియు ప్రజలకు ప్రసాదాలను పంపిణీ చేశారు.బొబ్బిలి కోటలో జరిగిన ఈ ఆయుధ పూజ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.




