Palakonda: పాలకొండ: రూ.17 కోట్ల పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Palakonda: పాలకొండ మున్సిపాలిటీలో రూ.17 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించగా, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 22 Sept 2026 3:46 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండ: రూ.17 కోట్ల పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

పాలకొండ: పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.17 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి దీపాల తదితర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్‌గా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారు గా పాల్గొన్నారు.

పాలకొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం, పార్కులు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని ఎమ్మెల్యే గారు తెలిపారు.

పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మొత్తం రూ.106.86 కోట్ల మేర నిధులు కేటాయించగా, ప్రస్తుతం రూ.79.86 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని, మరో రూ.27 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించారు.

ఇందులో రూ.17 కోట్ల HAM నిధులతో చేపట్టిన రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి దీపాల పనులు ప్రారంభించబడ్డాయి.మిగిలిన అభివృద్ధి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే జయక్రిష్ణ గారు అధికారులకు సూచించారు.

పాలకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎమ్మెల్యే గారు హర్షం వ్యక్తం చేశారు.

పాలకొండ పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాలకొండ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA