Gajuwaka: గాజువాకలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ!

Gajuwaka: గాజువాక వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. మేయర్ అభ్యర్థి వరద కళ్యాణి రోడ్‌షో, వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి.

PRAKASH, GAJUWAKA
Published on: 24 Oct 2026 7:35 PM IST
Gajuwaka
X

Gajuwaka: గాజువాకలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ!

Gajuwaka: వైసిపి మేయర్ అభ్యర్థి వరద కళ్యాణి ప్రచారంలో భాగంగా గాజువాకలో పలు వార్డులు భారీ ర్యాలీతో కార్పొరేటర్ అభ్యర్థులైన వారిని కలుసుకొని ప్రచార రథయాత్రలో వార్డుల్లో భారీ ర్యాలీలో పాల్గొని గాజువాక ప్రజలను ఉద్దేశిస్తూ తనకు తనతో పాటు నించున్న కార్పొరేట్ అభ్యర్థులందరికీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే విశాఖపట్నం లోని ఉన్న సమస్యలను త్వరగా పూర్తి చేయడంలో తాన ముందు ఉంటానని ట్రాఫిక్ సమస్యలు మంచినీటి విద్యుత్ దీపాల సమస్యలను రోడ్లు మెరుగుపరచడంలో ఫ్లైవర్ బ్రీజీ, మెట్రో రైలు, కాలుష్య నివారణ ఇలా అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటానని తన కార్పొరేటర్లు కూడా వార్డులో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే 91 వ వార్డు కార్పొరేటర్ మద్దాల అప్పారావుకి వార్డు ప్రజలు సహకరించి ఆయనకు మంచి మెజార్టీని అందించే బాధ్యత మన అందరిని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అందించే విధంగా ప్రజలందరూ పడుతున్న కష్టాలకు నాంది పలికి కూటమి పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మమ్మల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి వరద కళ్యాణి, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసిపి నాయకుడు రాజీవ్, వైసిపి కార్పొరేటర్ అభ్యర్థులు సీనియర్ గాజువాక నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA