Anakapalli: అనకాపల్లి మండలంలో జనసేనలోకి వైఎస్సార్‌సీపీ కీలక నేతలు
Anakapalli: అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో మండల పరిధిలోని వైఎస్సార్‌సీపీ మాజీ సర్పంచులు, కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు.
Anakapalli: అనకాపల్లి మండలంలో జనసేనలోకి వైఎస్సార్‌సీపీ కీలక నేతలు
అనకాపల్లి: అనకాపల్లి మండలంలో జనసేన పార్టీలోకి వైఎస్సార్‌సీపీ నాయకుల చేరికలు చోటుచేసుకున్నాయి. అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో మండలానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బగులవాడ మాజీ సర్పంచ్ మజ్జి వెంకట అప్పారావు, పిసినగాడ మాజీ సర్పంచ్ ఎల్లపు వెంకట రమేష్, వెంకుపాలెంకు చెందిన రాపేటి నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలు అనకాపల్లి మండలంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతమిచ్చే పరిణామంగా నిలిచాయి.




