Chodavaram: ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం!

Chodavaram: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ నాయకులు.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 17 Sept 2026 2:27 PM IST
Chodavaram
X

Chodavaram: ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వైసీపీ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ మాట్లాడుతూ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు విజ్ఞత లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

ఎంపీ సీఎం రమేష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కడపలో చల్లకపోవడం వల్లే అనకాపల్లి దిగుమతి చేసి మూడు పార్టీలు కలిపి గెలిపిస్తే తప్ప గెలవలేని ఎంపీ సీఎం రమేష్ అని

గుడివాడ అమర్నాథ్ తాతల నుంచి రాజకీయాల్లో ఉండి ఎంతో పేరు ప్రఖ్యాతలు గల కుటుంబంలో పుట్టి దివంగత నేత గుడివాడ గురునాధ రావు గారి కుమారుడుగా రాష్ట్రమంతా తెలిసిన వ్యక్తి అని అలాంటి వ్యక్తి కుటుంబ చరిత్ర కూడా కనీసం అవగాహన లేకుండా చౌకబారు వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్ వెంటనే బే షరతుగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు

పంచదారల కొండను కొల్లగొట్టింది మీ బినామీ సంస్థ ఏఎమ్ఆర్ కాదా?, అనకాపల్లి జిల్లాలో అవినీతి కార్యక్రమాలకు మీరు మీ కుటుంబ సభ్యులు మీ అనుచరులే బినామీలు కారా?? ఎన్నికల ముందు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కచ్చితంగా పునరుద్ధరిస్తామని అందరు బకాయిలు చెల్లిస్తామని ప్రగల్బాల్ పలికారు కదా మీరు వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీని మూసివేసింది మీరు కాదా?.

ఇదే గోవాడ షుగర్ ఫ్యాక్టరీని పిపిపి పద్ధతిలో మీరు హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మాట వాస్తవం కాదా?, అంటూ ఎంపీ సీఎం రమేష్ కు మీడియా ముఖంగా ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు దమ్ముంటే గుడివాడ అమర్నాథ్ పై చోడవరంలో పోటీ చేసి గెలవమని అప్పుడు మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధమని చాలెంజ్ విసిరారు.

చెప్పుకుంటూ పోతే మీ అవినీతి చరిత్రపై గంటల గంటలు మాట్లాడాల్సి వస్తుందని మమ్మల్ని ఇంతకుమించి రెచ్చగొట్టొద్దని మీరు బే షరతుగా గుడివాడ అమర్నాథ్ గారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీ పరిశీలకులు ఏడువాక సత్యారావు అనకాపల్లి టౌన్ అధ్యక్షులు దేవరపల్లి సత్య వేచలపు ప్రకాష్ చవితిని బాబురావు తదితరులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM