Anakapalli: అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ 111వ వార్డు ఆత్మీయ సమావేశం!
Anakapalli: అనకాపల్లి 111వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోరుకొండ రాఘవకు అవకాశం ఇవ్వాలని కోరారు.
Anakapalli: అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ 111వ వార్డు ఆత్మీయ సమావేశం!
Anakapalli: అనకాపల్లి 111వ వార్డు పరిధిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మలసాల భరత్ కుమార్ ఆదేశాల మేరకు 111వ వార్డు ఇన్‌చార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వార్డు సభ్యులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 111వ వార్డు నుంచి కోరుకొండ రాఘవకు అవకాశం కల్పించాలని పార్టీ శ్రేణులు కోరారు. రాఘవకు అవకాశం ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకొస్తామని సమావేశంలో పలువురు వార్డు సభ్యులు పేర్కొన్నారు.
ఎలాంటి పదవి లేకపోయినా రాఘవ ప్రజల్లో ఉంటూ, స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచారని వారు తెలిపారు. ప్రజలతో నిరంతరం మమేకమై సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయనకు పార్టీ అవకాశం కల్పించాలని కోరారు.
ఈ నేపథ్యంలో 111వ వార్డు అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి, అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మలసాల భరత్ కుమార్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




