Araku: అరకులో టీడీపీలోకి భారీగా వలసలు చేరిన వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు!

Araku: అరకు వేలి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు, మాజీ ఎంపీటీసీలు టీడీపీ ఇన్చార్జి డా. సియ్యారి దొన్ను దొర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

REHAMAN, ARAKU
Published on: 30 Sept 2026 6:15 PM IST
Araku
X

Araku: అరకులో టీడీపీలోకి భారీగా వలసలు చేరిన వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు!

Araku: అరకు వేలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అరకు వేలి, అనంతగిరి మండలాలకు చెందిన మూడు పంచాయతీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీలు శెట్టి వెంకట్రావు గారు, శెట్టి బుట్టి, నాయకులు శెట్టి అశోక్ బాబు గారు, కార్యకర్తలు, CPM జిల్లా ఉపాధ్యక్షులు కిల్లో మహేష్ బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ అరకు వేలిలోని అక్షయ్ ఇన్ హోటల్లో పసుపు కండువాలు వేసి తెలుగుదేశంలోకి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఏపిఎస్ఆర్టిసి విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా సియ్యారి దొన్ను దొర గారు ఆహ్వానించారు.

అరకు వేలి మండలం పెదలబుడు పంచాయతీ, పద్మాపురం పంచాయతీ, అనంతగిరి మండలం వాలాసీ పంచాయతీ లకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం గిరిజన ప్రజల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ, అభిమానం పాలన దక్షతకు ఆకర్షితులై వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వెల్లడించారు. తమ గ్రామాలకు ఇదివరకు రహదారులు కూడా లేని పరిస్థితి నుంచి ఈ రోజు గ్రామాల నుంచి మరొక గ్రామానికి అనుసంధానం చేస్తూ లింకు రోడ్లు, బిటి రోడ్లు నిర్మాణం చేస్తూ మరోపక్క ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ లో భాగంగా తాగునీరు అందిస్తుండడం ఇదివరకు ఈ స్థాయిలో జరగలేదన్నారు.

గిరిజన ప్రాంత ప్రజల గురించి నారా చంద్రబాబు నాయుడు గారి తరహాలో ఏ నాయకుడు కూడా ఇదివరకు ఆలోచన చేయలేదని తెలిపారు. తాము పండించే వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నటువంటి నాయకుడు పక్షాన నిలవకపోతే తమకు మద్దతుగా నిలిచిన వారికి అన్యాయం చేస్తామని అందుకే చంద్రబాబు పక్షాన నిలబడేందుకు పసుపు కండువా కప్పుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రభుత్వ కార్యక్రమాల ప్రజల్లో తీసుకెళ్లేందుకు స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపుకు కృషి చేస్తామని సందర్భంగా వారు పేర్కొన్నారు.

డా.సియ్యారి దొన్ను దొర గారు మాట్లాడుతూ దేశంలో అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఇక్కడ కార్యకర్తే అధినేత అని కార్యకర్త పనితనాన్ని ఆధారంగా వారికి స్థానిక నాయకులతో గానీ , నాయకత్వంతో సంబంధం లేకుండా అధిష్టానమే నేరుగా పదవులు ఇచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. ఇది ఏ పార్టీలోనూ ఉండదన్నారు. పార్టీ బలోపేతానికి మనం చేస్తున్న కృషి ఆధారంగా పదవుల వరించడం అనేది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమన్నారు. అందుకే అంగన్వాడీ టీచర్ ను శాసనసభ్యులుగా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని తెలిపారు.

పార్టీ బలోపేతం కోసం పార్టీ కష్టకాలంలో విధ్వంసకర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి నిలబడిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఓ సాధారణ మహిళకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన పార్టీ తమదన్నారు. క్లస్టర్ ఇన్చార్జిను పొలిటి బ్యూరోలో తీసుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది అన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీలో సభ్యుడిగా ఉండటమే గొప్ప అదృష్టంగా భావించాలన్నారు. ఈ రోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతా ఐక్యంగా పార్టీ బలోపేతానికి కలిసి కృషి చేద్దామని, స్థానిక ఎన్నికల్లో శత శాతం గెలుపే లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీలో చేరినవారు

పెదలబుడు పంచాయతీ నుంచి

శెట్టి వెంకట్రావు గారు, మాజీ ఎంపీటీసీ, శెట్టి బుట్టి గారు మాజీ ఎంపీటీసీ, శెట్టి అశోక్ బాబు గారు, శెట్టి గెన్ను గారు, లోతేరు మాజీ ఉపసర్పంచ్ సెట్టు మధు గారు, పాంగి ప్రదీప్ గారు, దన్ని అప్పలరాజు సన్యాసి గారు మాజీ వార్డు సభ్యులు, అనంతగిరి మండలం వాలాసి నుంచి,

బాకా నరసింహారావు గారు, చట్టు కన్నమ్మ గారు మాజీ వార్డ్ సభ్యుడు, పద్మాపురం పంచాయతీ, కిల్లో మహేష్ గారు, సిపిఎం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, పొట్టంగి కుమార్ గారు, మాజీ వార్డ్ మెంబర్, కిల్లో భీమరాజు గారు,వంతాల మహేష్ గారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు మండల అధ్యక్షుడు లోకోయి మహాదేవ్, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి కిల్లో శ్యామ్, అరకు నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షుడు బురిడీ కొమ్ములు నాయుడు, అరకు నియోజకవర్గ రైతు అధ్యక్షుడు గొల్లూరి సుబ్బారావు, సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, PACS చైర్మన్ పెట్టెలి రాము, మాజీ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, మాజీ ఎంపిటిసి LB భీమరాజు, మాజీ ఎంపీటీసీ పట్టాసి రామన్న, మాజీ సర్పంచ్ తెల్ల గంజి గంగమ్మ, మాజీ కనీస వేతనం డైరెక్టర్ బూర్జబకి లక్ష్మి, మాజీ ఎంపిటిసి వంతల వెంకటరావు, క్లస్టర్ ఇంచా కొర్ర శేఖర్, కొర్ర నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టి రాజు, కిల్లో నాగరాజు, టిడిపి సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్చార్జిలు బూత్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU