Visakhapatnam: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో విఎంఆర్‌డీఏ చైర్మన్ భేటీ

Visakhapatnam: నాగపూర్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను విఎంఆర్‌‌డీఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 4 Oct 2026 9:31 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో విఎంఆర్‌డీఏ చైర్మన్ భేటీ

Visakhapatnam: మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ను వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ .. మర్యాదపూర్వకంగా కలిశారు. సేవా సంకల్ప యాత్ర లో భాగంగా నాలుగో రోజు నాగపూర్ చేరుకున్న సందర్భంగా ఆదివారం సాయంత్రం నాగపూర్ లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిసి, ఆయన్ని ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు మాట్లాడుతూ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పురస్కరించుకొని తిరుపతి నుంచి వారణాసి వరకు సేవా సంకల్ప యాత్ర పేరిట బైక్ యాత్ర చేపట్టామని మహారాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కి వివరించారు.

బైక్ యాత్ర లో భాగంగా ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన వంటి వాటిని తెలియజేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ బైక్ యాత్ర చేపడుతున్న వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ని అభినందించారు. వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తో పాటు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు , ఇతర టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ప్రతినిధులు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.