Visakhapatnam: బార్ అసోసియేషన్ నేతలతో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి సమావేశం!

Visakhapatnam: జీవీఎంసీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి విశాఖ బార్ అసోసియేషన్‌ను కలుసుకున్నారు. నగర అభివృద్ధి, వైఎస్సార్‌సీపీ విజయం కోసం న్యాయవాదుల మద్దతు కోరారు.

SHIVA, BHIMILI
Published on: 27 Oct 2026 5:37 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: బార్ అసోసియేషన్ నేతలతో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి సమావేశం!

విశాఖపట్నం: జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు విశాఖపట్నం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఛాంబర్‌లో బార్ అసోసియేషన్ సభ్యులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో తనకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలిపి విజయానికి సహకరించాలని న్యాయవాదులను ఆమె కోరారు. ఈ సందర్భంగా వరుదు కళ్యాణి గారు మాట్లాడుతూ, విశాఖపట్నం నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.

నగర అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని, సమాజంలో న్యాయం, హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల్లో చైతన్యం కల్పించడంలో న్యాయవాదులు విశేష సేవలు అందిస్తున్నారని ఆమె అన్నారు.

రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి, జీవీఎంసీ అభివృద్ధికి తోడ్పడాలని బార్ అసోసియేషన్ సభ్యులను ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం సందర్భంగా న్యాయవాదులతో ఆమె ఆత్మీయంగా ముచ్చటించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణమోహన్, బాజీ నాయుడు, బీవీఆర్ మూర్తి, సన్నీ, రవిరాజ్, బార్ కౌన్సిల్ సభ్యులు, మాజీ ప్రభుత్వ న్యాయవాదులు (Ex-GPs & PPs), అలాగే పెద్ద సంఖ్యలో స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI