Visakhapatnam: ఆనందపురం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి!
Visakhapatnam: విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆనందపురం పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేశారు.
Visakhapatnam: ఆనందపురం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి!
Visakhapatnam: విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి బుధవారం ఆనందపురం పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, విధుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం ఆనందపురం సీఐ వీవీఎంసీ ఎర్రం నాయుడు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు,వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలు ప్రజలకు సేవలందించే లక్ష్యంతో చేపట్టారు. కార్యక్రమంలో డీసీపీ మణికంఠ చందవోలు,ఏసీపీ అప్పలరాజు,సీఐ వీవీఎంసీ ఎర్రం నాయుడు,ఎస్ఐలు సూరినారాయణ,శివ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.




