Visakhapatnam: విశాఖ బీచ్ రోడ్‌లో రన్ ఫర్ అంబేద్కర్ ర్యాలీ

Visakhapatnam: విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ నెల 22న భీమ్ సేన ఆధ్వర్యంలో 12వ రన్ ఫర్ అంబేద్కర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ వెల్లడించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 20 Nov 2026 6:58 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ బీచ్ రోడ్‌లో రన్ ఫర్ అంబేద్కర్ ర్యాలీ

విశాఖపట్నం: విశాఖలో భీమ్ సేన వైజాగ్ ఆధ్వర్యంలో తేది 22/11/2026 ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ కాళీ మాత విగ్రహం నుండి వై ఎం సి ఏ వరకు రాజ్యాంగ లక్ష్యాలు , ఆశయాలను ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో విశాఖ సాగర్ తీరంలో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్ధార్థ తెలిపారు.

ఈ సందర్భంగా రవి సిద్ధార్థ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నవంబర్ 26 , 1949వ సంవత్సరంలో రూపొందించారని సందర్భంగా గుర్తు చేశారు. నాటి రాజ్యాంగ పరిషత్ అందజేసిన రోజున దేశం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంది అని తెలిపారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు చేసిన సేవను వివరిస్తూ , రాజ్యాంగ దినోత్సవం గురించి రాజ్యాంగబద్ధంగా హక్కుల గురించి , చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రజలందరికీ తెలియజేసే విధంగా రన్ ఫర్ అంబేద్కర్ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 12వ రన్ ఫర్ అంబేద్కర్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.