Pendurthi: సింహాచలానికి ప్రభుత్వ విప్ గణబాబు సంప్రదాయ పాదయాత్ర!
Pendurthi: కార్తీక మాసం సందర్భంగా ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి పాదయాత్ర చేపట్టారు.
Pendurthi: సింహాచలానికి ప్రభుత్వ విప్ గణబాబు సంప్రదాయ పాదయాత్ర!
పెందుర్తి: తరతరాలుగా వస్తున్న పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) కార్తీక మాసం సందర్భంగా తన నివాసం నుంచి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కాలినడకన పాదయాత్ర చేపట్టారు. గరిడీ విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ కుటుంబ సభ్యులు, నూతన జీవీఎంసీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, వేలాది మంది అభిమానులతో కలిసి యాత్ర నిర్వహించారు.
మార్గమధ్యంలో పైడితల్లి అమ్మవారికి సారె సమర్పించి, గంగాధారలో పవిత్ర స్నానమాచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన, సంప్రదాయాలు, సేవాభావం పెంపొందితే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని అన్నారు. నూతన కార్పొరేటర్లు ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.




