Visakhapatnam: విశాఖలో వీడియో జర్నలిస్ట్ శివ దిలీప్‌కు ఘన సత్కారం!

Visakhapatnam: విశాఖలో వీ డిజిటల్ సీనియర్ వీడియో జర్నలిస్ట్ పాల్తేరు శివ దిలీప్ సేవలను అభినందిస్తూ ఘన సత్కారం.

GOPI, PENDURTHI
Published on: 22 Sept 2026 11:03 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో వీడియో జర్నలిస్ట్ శివ దిలీప్‌కు ఘన సత్కారం!

Visakhapatnam: భారతీయ సనాతన సంస్కృతి, విశిష్ట సంప్రదాయాలను భావితరాలకు సగర్వంగా అందించడంతో పాటు, సమాజ హితమే ధ్యేయంగా వార్తా ప్రసారాలలో నిరంతరం శ్రమిస్తున్న వీడియో జర్నలిస్టుల సేవలు ఎంతో అభినందనీయమని సీనియర్ పాత్రికేయుడు ఎం.ఎస్.ఆర్.ప్రసాద్,పలువురు ప్రముఖులు కొనియాడారు.

విశాఖలోని పోర్ట్ హాస్పిటల్ కూడలిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ వినాయక ఆలయ కమిటీ మరియు గురుపాద సేవా కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో వి డిజిటల్ సీనియర్ వీడియో జర్నలిస్ట్ పాల్తేరు శివ దిలీప్ సేవలను గుర్తిస్తూ ఆయనను ఘనంగా సత్కరించారు. సమాజ హితం కోసం, సాంస్కృతిక విశేషాలను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన చూపుతున్న నిబద్ధతను ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొనియాడారు.

ఈ విశేష కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎం.వి. రాజశేఖర్, ఆలయ ప్రధాన అర్చకులు శైవ ఆగమ సామ్రాట్ బాలానంద శివాచార్య ప్రత్యేకంగా పాల్గొని పాల్తేరు శివ దిలీప్‌ను దుస్సాలువ , జ్ఞాపికతో సత్కరించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. వార్తా సేకరణలో నిత్యం ముందుంటూ, బాధ్యతాయుతమైన

జర్నలిజానికి నిదర్శనంగా నిలుస్తున్న శివ దిలీప్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వినాయక ఆలయ కమిటీ, గురుపాద సేవా కమిటీ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI