Anandapuram: ఆనందపురంలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల ఉమ్మడి సర్వే

Anandapuram: ఆనందపురం పరిధిలోని జాతీయ రహదారిపై గత మూడు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాలను ట్రాఫిక్ పోలీసులు, రవాణా, హైవే అధికారులు సంయుక్తంగా పరిశీలించారు.

SHIVA, BHIMILI
Published on: 3 Oct 2026 6:06 PM IST
Anandapuram
X

Anandapuram: ఆనందపురంలో రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల ఉమ్మడి సర్వే

Anandapuram: తేదీ 10.03.2026 ది న నార్త్ ట్రాఫిక్ సిఐ సిహెచ్ ఉమాకాంత్ గారు ఆనందపురం ట్రాఫిక్ ఎస్ఐ పి పాపారావు గారు హైవే డిపార్ట్మెంట్ వారు రవాణా శాఖ అధికారులు ఉమ్మడిగా కలిసి ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు నెలలలో జరిగిన రోడ్డు ప్రమాదాల నేర స్థలాలను పరిశీలించి ప్రమాదం జరుగుటకు గల కారణాలను విశ్లేషించి ఇకమీదట ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యల గురించి ఉమ్మడిగా చర్చించడం జరిగింది.

దీని ద్వారా గమనించినది, ప్రమాదాలు జరుగుటకు ముఖ్య కారణాలుగా మితిమీరిన వేగము మరియు హైవేలో ఎక్కడ పడితే అక్కడ బారికేడ్ లు అనధికారంగా తొలగించి రోడ్డును దాటుట వలన ప్రమాదాలకు గురి అవుతున్నారు.

దీని గురించి హైవే వారికి తొలగించిన బారికేడ్ లు మరలా పునరుద్ధరించామని అలాగే స్పీడ్ లిమిట్ బోర్డులు కూడా ఏర్పాటు చేయమని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయమని , ఆనందపురం నుండి పెందుర్తి వరకు ఇరువైపుల సర్వీస్ రోడ్ లో ఉన్న స్పీడ్ బ్రేకర్ పైన రేడియం పెయింటింగు వెయ్యమని హైవే వారికి సూచించడం అయినది.

ఇట్లు

ట్రాఫిక్ ఎస్ఐ

Anandapuram PS

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI