Visakhapatnam: కోర్టుల తీర్పు ఎలా ఉన్నా బీసీలకు పార్టీపరంగా న్యాయం

Visakhapatnam: కోర్టుల తీర్పు ఎలా ఉన్నా బీసీలకు పార్టీ పరంగా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని స్పష్టం చేశారు.

JAI RAM, MADURAWADA
Published on: 9 Oct 2026 4:35 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: కోర్టుల తీర్పు ఎలా ఉన్నా బీసీలకు పార్టీపరంగా న్యాయం

విశాఖపట్నం: బీసీల పట్ల టీడీపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా బీసీలకు పార్టీ పరంగా న్యాయం చేస్తాం. మేయర్ పదవి, కార్పొరేషన్ సీట్లలో బీసీలకు ప్రాధాన్యత, బీసీ మహిళలకు సైతం మొదటి ప్రాధాన్యత ఇస్తాం.

బీసీలను వైసీపీ వదిలేసినంతగా మేము వదిలేయం, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏకపక్ష విజయం సాధిస్తాం. సంక్షేమం, అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమంటూనే వైసీపీ కోర్టులకు వెళ్తోంది, కుంటి సాకులతో ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రెండేళ్లుగా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాం. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. టీడీపీ అంటేనే బీసీల పార్టీ. బీసీలను వైసీపీ మభ్యపెడుతోంది. బీసీలు జగన్‌ను ఎప్పటికీ నమ్మరు. బీసీల తరఫున పోరాడేందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాం.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA