Visakhapatnam: ధరణి బ్రాండ్ సబ్సిడీ బియ్యం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

Visakhapatnam: విశాఖ దక్షిణ నియోజకవర్గం టౌన్ కొత్త రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సబ్సిడీ 'ధరణి' బియ్యం పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 19 Nov 2026 11:15 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: ధరణి బ్రాండ్ సబ్సిడీ బియ్యం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ధరణి నాణ్యమైన బియ్యం (BPT & KNM RICE) పంపిణీ కార్యక్రమంలో భాగంగా, టౌన్ కొత్త రోడ్డు వాసవి కల్యాణ మండపం రోడ్డులోని శ్రీ సంపత్ సాయి బియ్యం షాపులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సబ్సిడీ బియ్యం కౌంటర్‌ను దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు బుధవారం సాయంత్రం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందించాలనే సంకల్పంతో ధరణి బ్రాండ్ బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు.

BPT బియ్యం కిలో రూ.49, KNM బియ్యం కిలో రూ.50 చొప్పున ప్రజలకు అందించడం ద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి పోషకాలతో ఫోర్టిఫై చేసిన ఈ బియ్యం ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పౌర సరఫరాల వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధరణి బ్రాండ్ నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్ శ్రీ మజ్జిత్రినాథ్ గారు, 34 కార్పొరేటర్ శ్రీ జర్రిపోతుల ప్రసాద్ గారు, 37 వార్డు కార్పొరేటర్ శ్రీ శివప్రసాద్ రెడ్డి గారు ,మాజీ కార్పొరేటర్ లు, కూటమి నేతలు తో పాటు DSO భాస్కరరావు, ఆర్.ఐ. శ్రీదేవి, షాపు యజమాని జగదీష్, కూటమి నాయకులు, అధికారులు, జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.