Visakhapatnam: నేడు 22ఏ నిషేధిత భూముల సమస్యలపై రోల్ బ్యాక్ సదస్సు

Visakhapatnam: విశాఖలో నేడు 22ఏ నిషేధిత భూముల సమస్యలపై రోల్ బ్యాక్ సదస్సు. హాజరుకానున్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి.

GOPI, PENDURTHI
Published on: 26 Sept 2026 7:42 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: నేడు 22ఏ నిషేధిత భూముల సమస్యలపై రోల్ బ్యాక్ సదస్సు

విశాఖపట్నం: సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములు సమస్యలపై ఆదివారం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నంలో సదస్సు నిర్వహిస్తున్నారని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో 2010 నుంచి లక్షలాది ఎకరాలు భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితులకు అవగాహన కల్పించడంతో పాటు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ.బీ.వెంకటేశ్వరావు, నల్లమోతు చక్రవర్తి తదితరులు పాల్గొంటారు.

కొందరు హైకోర్టులో కేసులు వేయగా ప్రజలకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ వారి ఆస్తులను 22ఏ నిషేధిత జాబితా నుంచి రెవెన్యూ అధికారులు ఇంకా తొలగించడం లేదన్నారు. 22a నిషేధిత భూబాధితులందరూ హాజరై సమస్యలు తెలియజేయాలని, ఈ సందర్భంగా రామ్ కోరారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI