Visakhapatnam: విశాఖలో రేషన్ డీలర్ల మీడియా సమావేశం.. పలు డిమాండ్లు!
Visakhapatnam: విశాఖపట్నంలో రాష్ట్ర రేషన్ డీలర్స్ సమాఖ్య మీడియా సమావేశం. కిలోకు రూ.2 కమిషన్ ఇవ్వాలని, క్యూఆర్ కోడ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
Visakhapatnam: విశాఖలో రేషన్ డీలర్ల మీడియా సమావేశం.. పలు డిమాండ్లు!
Visakhapatnam: రాష్ట్ర రేషన్ డీలర్స్ సమాఖ్య విశాఖ లో మీడియా తో మాట్లాడారు. ఈ సమావేశంలో అల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి బిశ్వంబర్ బసు మరియు రాష్ట్ర రేషన్ డీలర్స్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లు కి క్యూ ఆర్ కోడ్ ఇవ్వడం వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం.
కిలో దగ్గర 2/- కమిషన్ ఇవ్వాలి, ఎండీ వాహనాల అమలు సమయంలో ఇబ్బందులు పడ్డం. అవి పునరావృతం కాకుండా రేషన్ షాపు లు డోర్ నంబర్ల ఆధారంగా కేటాయించాలని డిమాండ్ చేశారు.. ఇప్పటికే మండల స్థాయిలో వినతి పత్రాలు ఇచ్చాం.. మా సమస్యలు పరిష్కారం పై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.




