Gajuwaka: విశాఖలో పాత నేరస్తుడు మల్లారెడ్డి వెంకటేష్ అరెస్ట్!

Gajuwaka: విశాఖపట్నం గజువాకలో 70 నేరాల్లో నిందితుడైన పాత నేరస్తుడు మల్లారెడ్డి వెంకటేష్‌ను అరెస్ట్ చేసి నగదు, వాహనాలు రికవరీ చేసిన సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు.

PRAKASH, GAJUWAKA
Published on: 3 Oct 2026 8:37 AM IST
Gajuwaka
X

Gajuwaka: విశాఖలో పాత నేరస్తుడు మల్లారెడ్డి వెంకటేష్ అరెస్ట్!

Gajuwaka: బంగారం, వెండి 70 నేరాల్లో నిందితుడైన పాత నేరస్తుడు మల్లారెడ్డి వెంకటేష్ అరెస్ట్. వస్తువులు, నగదు మరియు ద్విచక్ర వాహనాల రికవరీ మొత్తం 6 కేసులను ఛేదించిన విశాఖ సిటీ సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు.

తాళాలు పగులగొట్టి దొంగతనాలు, కిటికీల ద్వారా నగదు, బ్యాగులు, పర్సులు అపహరించడం మరియు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు మల్లారెడ్డి వెంకటేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయనగర్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ఎరుపు రంగు హీరో హోండా ప్లెజర్ స్కూటీ (AP31BR5447) చోరికి గురైనట్లు బాధితుడు దమ్ము నీలకంఠం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గాజువాక స్వతంత్ర నగర్ Y-జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, చోరికి గురైన స్కూటీపై వస్తున్న నిందితుడు పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిపై 2011 సంవత్సరం నుండి గాజువాక పోలీస్ స్టేషన్ల Suspect Sheet No.06/2011 కొనసాగుతోంది.

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, సులభంగా డబ్బు సంపాదించేందుకు నిందితుడు దొంగతనాలకు పాల్పడుతూ, ముందుగా ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిపై తిరుగుతూ రెక్కీ నిర్వహించేవాడు.

అనంతరం తాళం వేసిన ఇళ్ల తాళాలు, బీరువాలను ఇనుప రాడ్డుతో పగులగొట్టి చోరీలు చేయడం, అలాగే ఇళ్ల కిటికీల ద్వారా హ్యాండ్ బ్యాగులు, పర్సులు అపహరించడం అతని నేర విధానంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

నిందితుడిపై గతంలో ఇంటి దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలు మరియు స్క్రాప్ దొంగతనాలు అన్నీ కలిపి మొత్తం 70 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి.

వాటిలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో 27 కేసులు, దువ్వాడ పోలీస్ స్టేషన్ 8 కేసులు, న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ 2 కేసులు మరియు సిటీ పరిదిలో వివిద పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదై ఉన్నాయి.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA