Visakhapatnam: సీఎం చంద్రబాబును కలిసిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్!
Visakhapatnam: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ సీఎం చంద్రబాబును కలిసి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. భోగాపురం వద్ద రూ.55 కోట్లతో ముక్కం కోస్టల్ వెల్‌నెస్, సర్ఫ్ క్లబ్ ఏర్పాటు కానుంది.
Visakhapatnam: సీఎం చంద్రబాబును కలిసిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్!
విశాఖపట్నం: దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన జాంటీ రోడ్స్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. భోగాపురం విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తున్న ముక్కం కోస్టల్ వెల్ నెస్, సర్ఫ్ క్లబ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. రూ.55 కోట్ల పెట్టుబడితో భోగాపురం సమీపంలోని ముక్కం బీచ్ లో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.




