Visakhapatnam: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ - టీడీపీలోకి 200 మంది చేరిక!

Visakhapatnam: ఆనందపురం మండలంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో 200 మందికి పైగా వైకాపా కార్యకర్తలు టీడీపీలో చేరారు.

SHIVA, BHIMILI
Published on: 8 Oct 2026 4:34 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ - టీడీపీలోకి 200 మంది చేరిక!

Visakhapatnam: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆనందపురం మండలంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. శొంట్యాం గ్రామానికి చెందిన కోరుకొండ ప్రసాద్ నాయకత్వంలో 200 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో గురువారం తెలుగుదేశం జెండాలు కప్పుకున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పసుపు కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు టీడీపీ, జనసేన పార్టీలలో చేరడానికి పోటీ పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కూటమి చేతుల్లోనే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం నమోదు చేయబోతున్నామన్నారు.

వైసీపీ రాజకీయ భవిష్యత్ అంధకారం కానుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, తాట్రాజు అప్పారావు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, అచ్చిబాబు, రాంబాబు, మదపాటి శ్రీను, ఎర్ర రాజు, చిన్న తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI