Visakhapatnam: విశాఖ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి అరుదైన అర్జున అవార్డు గౌరవం!

Visakhapatnam: విశాఖ అథ్లెట్, ఒలింపియన్ జ్యోతి యర్రాజీకి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అర్జున అవార్డు–2024 సర్టిఫికెట్, ట్రోఫీ అందజేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 14 Nov 2026 3:06 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి అరుదైన అర్జున అవార్డు గౌరవం!

Visakhapatnam: విశాఖ అథ్లెట్, ఒలింపియన్ జ్యోతి యర్రాజీకి అరుదైన గౌరవం. ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు – 2024 సర్టిఫికెట్, ట్రోఫీని అందుకున్న జ్యోతి. 2026 నవంబర్ 13న న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో అవార్డు ప్రదాన కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జ్యోతి యర్రజీ. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత జాతీయ రికార్డు హోల్డర్‌గా జ్యోతి గుర్తింపు.

ఈ విభాగంలో అర్జున అవార్డు అందుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డ్. 2025 జనవరి 2న అర్జున అవార్డు ప్రకటించగా, అప్పటి కార్యక్రమానికి హాజరుకాలేకపోవడంతో తాజాగా సర్టిఫికెట్, ట్రోఫీ అందజేశారు. విశాఖ కీర్తి పతాకను జాతీయ స్థాయిలో ఎగురవేసిన జ్యోతి యర్రాజీ.. అర్జున అవార్డుతో మరో మైలురాయి.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.